తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావు వైసిపి పార్టీపై తీవ్రస్థాయిలో శనివారం మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం కు మంచి పేరు వస్తుండటంతో దానిని చూసి ఓర్వలేక వైసిపి పార్టీ భూమన కరుణాకరరెడ్డి ఆధ్వర్యంలో అనేక కుట్రలు చేస్తుందని ఆయన అన్నారు. టిటిడి గోశాలలో గోవులు మృతి చెందాయని భూమన తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయడం మానుకోవాలన్నారు.