మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని టీటీడీ ప్రతిష్టకు భంగం కలిగిస్తే తగిన మూల్యం చెల్లించుకుంటారని ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పేర్కొన్నారు. ఎమ్మెల్యే ఒక ప్రకటనలో మాట్లాడుతూ భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ గోమరణాలపై చేస్తున్న అసత్య ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న టీటీడీ భక్తుల మనోభావాలను ఆయన దెబ్బతీస్తున్నారన్నారు.