ఉదయగిరి మండలంలో శనివారం సాయంత్రం ఉరుములు మెరుపులతో కూడిన బీకర వర్షం సుమారు గంటసేపు కురిసింది. ఈ సమయంలో పిడుగు పడడంతో ఐదు మేకలు అక్కడికక్కడే మృతి చెందాయి. మేకల కాపరి పేరయ్య మేకలను ఇంటివద్ద దొడ్డిలో తొలాడు. అక్కడ పిడుగు పడడంతో ఐదు మేకలు మృతి చెందాయి. తనకు జీవనాధారమైన మేకలు చనిపోవడంతో ఆ వ్యక్తి బోరున విలపించాడు. తనకు ప్రభుత్వం ఆర్థికంగా సాయం చేయాలని కోరారు.