గంగిరెడ్డిపల్లిలో ఈ నెల 14 నుంచి గంగమ్మ తిరునాళ్లు

64చూసినవారు
గంగిరెడ్డిపల్లిలో ఈ నెల 14 నుంచి గంగమ్మ తిరునాళ్లు
ఉదయగిరి మండలం గంగిరెడ్డిపల్లిలో వెలసి ఉన్న శ్రీ అనంతపూరి గంగాభవాని అమ్మవారి తిరునాళ్లు ఈనెల 14 నుంచి 17వ తేదీ వరకు జరగనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు గురువారం తెలిపారు. 14న శ్రీ సీతారాముల వారి కళ్యాణం, గ్రామోత్సవం, 15వ తేదీ వనభోజనం, వసంతోత్సవం 16న కుంకుమ పూజ, 17న గ్రామోత్సవంతో తిరునాళ్లు ముగుస్తాయని తెలిపారు. భక్తులు భారీగా తరలిరావాలని కోరారు. కాగా గంగమ్మ తిరునాళ్లు అంటే చుట్టుపక్కల ఎంతో ప్రసిద్ధి.

సంబంధిత పోస్ట్