నెల్లూరు జిల్లా ఉదయగిరి మండల సర్వసభ్య సమావేశం ఈనెల 20వ తేదీన జరగనుంది. ఉదయగిరి పట్టణంలోని శ్రీ శక్తి భవనంలో ఈ కార్యక్రమం జరుగుతుందని ఎంపీడీవో అప్పాజీ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎంపీపీ మూలే పద్మజ వినయ్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి మండలంలోని జడ్పిటిసి, ఎంపీటీసీలు, సర్పంచ్లు, మండల స్థాయి అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని తెలిపారు. అలాగే అధికారులు సమగ్ర నివేదికతో రావాలన్నారు.