ఉదయగిరి: బాలికలకు పలు చట్టాలపై అవగాహన

78చూసినవారు
ఉదయగిరి: బాలికలకు పలు చట్టాలపై అవగాహన
ఉదయగిరి పట్టణంలోని హెచ్. ఆర్ అంగన్వాడి కేంద్రంలో కిషోరి వికాసం కార్యక్రమాన్ని ఐసిడిఎస్ ప్రాజెక్ట్ సిీడీపీవో సునీత ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ అంగన్వాడీ కేంద్రం పరిధిలోని కిషోర బాలికలతో సమావేశమై వారికి బాల్య వివాహాలు, ఫోక్సో యాక్ట్, పలు రకాల చట్టాలపై అవగాహన కల్పించారు. బాలలపై దుర్భాషలు, అఘాయిత్యాలకు పాల్పడితే తీసుకోవాల్సిన చర్యల గురించి తెలిపారు. బాలికలకు అండగా ఐసీడీఎస్ ఉంటుందన్నారు.

సంబంధిత పోస్ట్