నెల్లూరు జిల్లా, ఉదయగిరి మండలంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం సాయంత్రం సమయంలో సుమారు ఒక 20 నిమిషాల పాటు చిరుజల్లులు కురిసాయి. ఇదే మండలంలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం సైతం కురిసింది. ఈరోజు ఉదయం నుంచి ఆకాశం నల్లటి మబ్బులతో మేఘమృతమై ఉంది. ఇటీవలే నెల్లూరు జిల్లాలో వర్షాలు బీభత్సం సృష్టించగా మళ్లీ వాతావరణంలో మార్పులు జరగడం వర్షాలు పడేదానికి సూచికలా అనిపిస్తుంది.