అహ్మదాబాద్ విమాన ప్రమాదం తనను తీవ్రంగా బాధించిందని ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ విమాన ప్రమాదంలో 240 మందికి పైగా మరణించడం తీవ్రంగా కలచి వేసిందని అన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు దేవుడు ధైర్యాన్ని అందించాలని కోరారు. ఈ విషయం విన్న తర్వాత ఏం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదని ఎమ్మెల్యే ఆవేదనకు లోనయ్యారు.