ఉదయగిరి ఎంపీడీవో కార్యాలయ మరమ్మత్తుల పనులను పంచాయతీరాజ్ అధికారులు శుక్రవారం పరిశీలించారు. ఎంపీడీవో కార్యాలయ నిర్మాణం పనులను నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. ఇప్పటివరకు జరిగిన పనుల కొలతలను నమోదు చేసుకున్నారు. అలాగే సిబ్బందికి పలు సలహాలు చేశారు. ఈ కార్యక్రమంలో పిఆర్ ఏ ఈ రాజు, ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఆదిరెడ్డి, ఎంపిటిసి జి. తిరుపతి, వెంగల్ రెడ్డి, అక్కుల్ రెడ్డి ఉన్నారు.