ఉదయగిరి మండలంలోని తిరుమలపురం పంచాయతీ గిరిజన కాలనీలో ఉన్న పాఠశాలలను దుంపవారి పల్లి గ్రామానికి తరలించవద్దంటూ గురువారం గిరిజనులు ఉదయగిరిలోని విద్యా వనరుల కేంద్రంలో ఎంఈఓ-2 తోట శ్రీనివాసులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా గిరిజనులు మాట్లాడుతూ మా గ్రామానికి కిలోమీటర్ దూరంలో ఉన్న దుంపవారి పల్లికి పాఠశాలను మారిస్తే విద్యార్థులు చదువులకు ఆటంకం కలుగుతుందన్నారు. పాఠశాల మా ఊర్లోనే ఉంచాలని కోరారు.