ఉదయగిరి ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ సర్కిల్ పరిధిలో బెల్ట్ షాపులు నిర్వహిస్తే చర్యలు తప్పవని ఎక్సైజ్ సీఐ లక్ష్మణస్వామి గురువారం తెలిపారు. నాలుగు మండలాల్లోని 12 మద్యం దుకాణాల యజమానులు ఉదయం 10 నుంచి రాత్రి 10 వరకు మద్యం షాపులు తెరిచి సమయపాలన పాటించాలని కోరారు. అలాగే మద్యం షాపుల సమీపంలో మద్యం సేవించరాదన్నారు. ప్రభుత్వ నిబంధనలు ఎవరైనా అతిక్రమిస్తే శాఖపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.