జై చెన్నకేశవ అంటూ ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ శ్రీ చెన్నకేశవ స్వామి రథాన్ని లాగారు. వింజమూరు పట్టణంలోని యర్రబల్లి పాలెంలో వేంచేసియున్న శ్రీ శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా ఏడవ రోజు సోమవారం రథోత్సవం కార్యక్రమం కన్నులు పండుగగా నిర్వహించారు. పాత బస్టాండ్ సెంటర్లో రథోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని రథాన్ని లాగారు.