రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఉల్లాస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఉదయగిరి ఎంపీడీవో అప్పాజీ, ఏపీఎం మహమ్మద్ ఖాజా రహమతుల్లా తెలిపారు. స్థానిక వెలుగు కార్యాలయంలో వీవోఏలకు వయోజన విద్యకు సంబంధించిన పాఠ్య పుస్తకాలు, వాచకాలను, హాజరు రిజిస్టర్ను గురువారం అందజేశారు. ఆయన మాట్లాడుతూ. మండలంలో ఉన్న 33 మంది వీవోఏలు ప్రతి ఒక్కరూ 10 మంది చొప్పున నిరక్షరాస్యులకు చదవడం రాయడం నేర్పించాలన్నారు.