ఉదయగిరి: చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

53చూసినవారు
ఉదయగిరి: చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
వింజమూరు మండలం బొమ్మరాజు చెరువు సమీపంలో ఆగి ఉన్న మోటర్ సైకిల్ ను మరో మోటార్ సైకిల్ ఆదివారం రాత్రి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో గాయపడిన కలిగిరి మండలం పోలంపాడుకు చెందిన కరెంట్ మెకానిక్ దామచర్ల హజరత్ రావు (50) నెల్లూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ మొదలుపెట్టారు.

సంబంధిత పోస్ట్