ఉదయగిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎంఈఓ-2 తోట శ్రీనివాసులు విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణ విద్యా మిత్ర కిట్లను గురువారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి ప్రభుత్వ పాఠశాలకు ఉత్తమ ఫలితాలు వచ్చేలా కృషి చేయాలని ఆకాంక్షించారు. విద్యార్థులకు పాఠశాలల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.