హీరో నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలలో పాల్గొన్న ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్. సినీ, రాజకీయ, సేవా రంగాలలో విశేష సేవలు అందించిన నటసింహం, పద్మ భూషణ్ నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు ఉదయగిరి మండల కేంద్రంలో మంగళవారం అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ పాల్గొని నందమూరి అభిమానులతో కలసి కేక్ కట్ చేసి బాలకృష్ణ పై తన అభిమానాన్ని చాటుకున్నారు.