ఉదయగిరి మండలం గండిపాలెం రిజర్వాయర్ సాధనకు కృషి చేసిన మాజీ ఎమ్మెల్యే దివంగత నేత పొన్నుబోయిన చెంచురామయ్య 22వ వర్ధంతి కార్యక్రమం ఆయన కుమారుడు మాజీ జడ్పీ చైర్మన్ పొన్నుబోయిన చంచల బాబు యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఉదయగిరి పట్టణ పరిధిలోని చంచల బాబు గెస్ట్ హౌస్ నందు ఆదివారం జరిగిన ఈ కార్యక్రమానికి ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్- ప్రవీణ దంపతులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.