వింజమూరు మండలం జనార్ధన పురం గ్రామానికి చెందిన నల్లపునేని మల్లేష్ తమ్ముడు, నల్లపునేని నాగార్జున(28) శుక్రవారం మృతి చెందారు. స్థానిక నాయకుల ద్వారా ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సమాచారం తెలుసుకున్నారు. ఎమ్మెల్యే ఆదేశాలతో వింజమూరు టిడిపి నాయకులు వెళ్లి మృతుని భౌతికాయానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా, రూ. 50 వేలు ఆర్థిక సహాయాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు.