ఉదయగిరి నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల ఉపాధి హామీ పథకం పనులపై, ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యలపై ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్, డ్వామా పిడి గంగాభవానితో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. గురువారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అన్ని మండలాల ఏపీవోలు తో ఉపాధి హామీ పథకం లో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్స్ సీనియర్ మేట్స్ తో సమీక్షించారు.