దుత్తలూరు మండలం నర్రవాడ గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ జనార్ధన స్వామి వారి ఆలయంలో జరుగుతున్న జీర్ణోద్ధరణ మహా సంప్రోక్షణ కార్యక్రమంలో ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ పాల్గొన్నారు. 30వ తేదీ నుండి మూడో తేదీ వరకు శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి వారి పర్యవేక్షణలో వేద పండితుల మంత్రోచ్ఛారణలతో భక్తిశ్రద్ధలతో అత్యంత ఘనంగా ఈ కార్యక్రమం జరిగింది.