మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి దేశ ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేసింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జనవరి ఒకటో తేదీ వరకు సంతాప దినాలుగా ప్రకటించాయి. దీంతో ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ నూతన సంవత్సర సంబరాలకు దూరంగా ఉన్నారు. శుక్రవారం కాకర్ల సురేష్ టీడీపీ ప్రధాన పార్టీ కార్యాలయానికి రాగానే నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు అధికారులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.