నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం గండిపాలెం జలాశయం ప్రధాన కుడి కాలువను ఇన్ ఛార్జ్ ఈఈ చంద్రమౌళి సిబ్బందితో కలిసి గురువారం పరిశీలించారు. రాబోయే సీజన్ లో పంటకు జలాశయం నుంచి నీరు వదిలేందుకు అవసరమున్న చోట మరమ్మత్తులు చేపట్టేందుకు ఈ పరిశీలన చేసినట్లు అధికారులు తెలిపారు. ఆయనతో ఏఈలు వేణు, సురేష్, పలువురు రైతులు ఉన్నారు.