ఉదయగిరి మండలం పుల్లాయపల్లి మెయిన్ అంగన్వాడి కేంద్రంలో 'మన అంగన్వాడీ పిలుస్తుంది' కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సీడీపీఓ ఎన్. సునీత పాల్గొన్నారు. సీడీపీఓ అంగన్వాడి కేంద్రంలోని పిల్లల చేత అక్షరాభ్యాసం చేయించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మూడేళ్లు నిండిన పిల్లలందరినీ అంగన్వాడి కేంద్రానికి పంపించాలని తల్లిదండ్రులకు సూచించారు. అంగన్వాడీలో ఆటపాటలతో పాటు విద్య ఉంటుందన్నారు.