రేపటి కాలానికి ముందడుగు నేటి బాలలేనని, మీరందరూ శ్రద్ధగా చదివి లక్ష్యాన్నిషేదించి ఉన్నత శిఖరాలకు ఎదగాలని, విద్య తోనే పేదరికాన్ని జయించవచ్చని ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ పేర్కొన్నారు. శుక్రవారం కలిగిరి మండలం లోని ఏపీ మోడల్ స్కూల్ ప్రాంగణంలో జరిగిన 12వ వార్షికోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భరతనాట్యంతో విద్యార్థులను అధ్యాపకులను, అతిథులను అబ్బురపరిచారు.