ఉదయగిరి: విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి

72చూసినవారు
ఉదయగిరి: విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి
ఉదయగిరి మండలం లోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథక నిర్వాహకులు నాణ్యమైన భోజనం వడ్డించాలని ఎంఈఓ -2 తోట శ్రీనివాసులు తెలిపారు. ఆయన శుక్రవారం ఉదయగిరి పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజనం పథకాన్ని తనిఖీ చేశారు. భోజనం రుచి చూసి నిర్వహకులకు, హెచ్ఎం కు తగు సూచనలు చేశారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందజేయాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్