ఉదయగిరి మండలం పరిధిలోని ఆటోలు నడిపే డ్రైవర్లకు ఎస్ఐ-2 శ్రీనయ్య బుధవారం పలు సూచనలు చేశార. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు వాహనాలు నడిపే సమయంలో తప్పనిసరిగా యూనిఫామ్ ధరించాలని, లైసెన్స్ కలిగి ఉండాలని సూచించారు. ఆటోలో పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కించుకోకూడదు అన్నారు. డ్రైవర్ కి ఇరువైపుల ప్రయాణికులను కూర్చోబెట్టుకోకూడదని మహిళ ప్రయాణికుల పట్ల మర్యాదపూర్వకంగా మెలగాలని హెచ్చరికలు చేశారు.