ఉదయగిరి మండలంలో శుక్రవారం తెల్లవారుజాము నుంచి విపరీతంగా మంచు కురుస్తుంది. మంచు తీవ్రత ఎక్కువై చిన్నపాటి వర్షపు చినుకులవలే తుప్పర్లు పడుతుంది. ఉదయం 7 గంటలు అవుతున్నప్పటికీ మంచు తీవ్రత తగ్గక పోగా ఇంకా ఎక్కువవుతుంది. ఎండాకాలం రావడంతో ఇటీవల చలి తగ్గినప్పటికీ ఈరోజు మాత్రం దట్టంగా మంచు కమ్ముకుంది. దీంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఓ వైపు మంచు మరోవైపు ఎండతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు.