రాబోయే సంక్రాంతి పండుగ సందర్భంగా జిల్లాలో ఎవరైనా పేకాట, అసాంఘిక కార్యక్రమాలు, కోడిపందేలను ప్రోత్సహించవద్దన్నారు. బెట్టింగులకు పాల్పడడం చట్టరీత్యా నేరమని, కోడి పందాలు నిర్వహించినా, పాల్గొన్నా వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని నెల్లూరు ఎస్పీ కృష్ణ కాంత్ తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ ప్రత్యేక బృందాలతో ఆయా ప్రదేశాలలో ఎప్పటికప్పుడు పోలీస్ పటిష్ట నిఘా ఏర్పాటు చేస్తామన్నారు.