నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం సమయంలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. ఉదయగిరి మండలం గండిపాలెం లో 20 సంవత్సరాల నుంచి ఉన్న ఓ భారీ గంగిరేగి వృక్షం నేలకొరిగింది. ఈ భారీ చెట్టు పడిపోవడం వలన ప్రధాన రహదారిలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. టిడిపి నాయకుడు చుండ్రు పృథ్వి జెసిబి సహాయంతో ఆ చెట్టును తొలగించి రాకపోకలకు అంతరాయం లేకుండా చేశారు.