ఈనెల 13న హైదరాబాదు మియాపూర్ లోని నరేన్ గార్డెన్స్ లో ఉదయగిరి నియోజకవర్గం కు చెందిన వలస వాసులతో ఆత్మీయ సమావేశం నిర్వహించనున్నట్లు ఉదయగిరి మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బయన్న గురువారం తెలిపారు. ఈ సమావేశంలో నెల్లూరు పార్లమెంట్, ఉదయగిరి అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కాకర్ల సురేష్ లు ముఖ్య అతిథులుగా హాజరవుతారన్నారు.