వరికుంటపాడు మండలం పెద్దిరెడ్డిపల్లి రిజర్వాయర్ ను నెల్లూరు జిల్లా రైతు సంఘం, జన విజ్ఞాన వేదిక నాయకులు సోమవారం సందర్శించారు. అనాదిగా పాలకుల నిర్లక్ష్యానికి నిరాదరణకు గురి అయ్యి ఉదయగిరి ప్రాంత ప్రజలు ఎన్నో కష్టనష్టాలు పడుతున్న దుర్భరమైన పరిస్థితి ఈరోజు కూడా ఉంది. ఈ పరిస్థితి మారాలంటే ఈ ప్రాంతానికి సాగునీరు అందించి ఇక్కడ వ్యవసాయం అభివృద్ధి చేసి ప్రజల జీవన ప్రమాణాలు బావుండాలని నాయకులు అన్నారు.