ఉదయగిరి పట్టణ శివారు ప్రాంతమైన కరెంట్ ఆఫీస్ సమీపంలో జాతీయ రహదారి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వీఆర్వోలు మస్తాన్, జాఫర్ లు బుధవారం సాయంత్రం విధులు ముగించుకొని మోటర్ బైక్ పై దుత్తలూరు కు వెళుతుండగా ప్రమాదవశాత్తు బైక్ అదుపుతప్పింది. ఈ ప్రమాదంలో వీఆర్వోలకు గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న మరో విఆర్ఓ మాలకొండయ్య ఘటన స్థలానికి చేరుకునే క్రమంలో ఆయన బైకు కూడా అదుపు తప్పడంతో ప్రమాదం జరిగింది.