కూటమి ప్రభుత్వం ఏర్పాటు పూర్తయి సంవత్సరం దాటిన సందర్భంగా, ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ని, పీఓసీ కొట్టె వెంకటేశ్వర్లు నేతృత్వంలో ఉదయగిరి నియోజకవర్గంలోని 8 మండలాల జనసేన ముఖ్య నాయకులు వింజమూరు కార్యాలయంలో బుధవారం కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులపై వారికి అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో ఎన్డీయే కూటమి నాయకత్వంలో ప్రజల అభివృద్ధి కోసం కలిసి పని చేస్తామని తెలిపారు.