నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం పరిధిలోని అంగన్వాడీ కార్యకర్తలకు పోషణ బి పడాయి శిక్షణ కార్యక్రమం ఉదయగిరి పట్టణంలోని ప్రగతి కళాశాలలో మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్స్ పాల్గొని మాట్లాడారు. అంగన్వాడి కేంద్రంలో పిల్లలకు నైపుణ్యాన్ని పెంచే అంశాలపై అంగన్వాడీ కార్యకర్తలకు శిక్షణ ఇచ్చారు. గతంలోనూ ఆరు రోజులపాటు అంగన్వాడీలకు శిక్షణ జరిగిన విషయం తెలిసిందే. మరో రెండు రోజులు శిక్షణ జరగనుంది.