ఉదయగిరి పట్టణంలోని పీసీ కాలనీ అంగన్వాడి కేంద్రంలో బుధవారం వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఏఎన్ఎం జయమ్మ ఆధ్వర్యంలో ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు వ్యాక్సిన్లు వేశారు. అలాగే గర్భిణీలు, బాలింతలకు పలు సూచనలు సలహాలు చేశారు. పోషక విలువలు కలిగిన ఆహారం ఎక్కువగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్త జబీన్, ఆశా కార్యకర్త మహబూబ్జాని పాల్గొన్నారు.