ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ను వింజమూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వరికుంటపాడు మండలం టిడిపి నేతలు గురువారం కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కు వారు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కాగా నూతన సంవత్సరం అయినటువంటి జనవరి 1వ తేదీ ఎమ్మెల్యే కాకర్ల నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో లేని విషయం తెలిసిందే. దీంతో ఎమ్మెల్యేను కలిసేందుకు భారీగా టిడిపి నాయకులు కార్యాలయానికి చేరుకున్నారు.