ఉదయగిరి పట్టణంలోని ఆరోగ్య కేంద్రంలో ప్రభుత్వం నుంచి కీళ్లు ఎముకల విభాగం నుంచి పెన్షన్ పొందే లబ్ధిదారుల సదరం ధ్రువీకరణ పత్రాల పరిశీలన కార్యక్రమం సోమవారం జరిగింది. ఉదయగిరి నియోజకవర్గంలోని ఎనిమిది మండలాలకు ప్రతి సోమవారం, మంగళవారం, బుధవారం రోజులలో ఒక్కొక్క రోజు 50 మందికి చొప్పున సర్టిఫికెట్లు పరిశీలన జరగనుంది. సర్టిఫికెట్ల పరిశీలనతోపాటు లబ్ధిదారులకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.