మద్యం షాపు ఏర్పాటు చేయవద్దు అంటూ మహిళలు ఆందోళన చేసిన ఘటన గండిపాలెంలో చోటుచేసుకుంది. ఉదయగిరి మండలం గండిపాలెంలో మద్యం షాపు ఏర్పాటు చేయకూడదంటూ గురువారం స్థానిక మహిళలు నిరసన తెలిపారు. తమ గ్రామంలో మద్యం షాప్ ఏర్పాటు చేస్తే ప్రతిరోజు అల్లర్లు, గొడవలు జరిగే అవకాశం ఉందని తద్వారా చుట్టుపక్కల ప్రజలు ప్రశాంతంగా ఉండలేరని ఆవేదన చెందారు. జిల్లా స్థాయి అధికారులు దీనిపై స్పందించి షాప్ పెట్టకుండా చూడాలని కోరారు.