ఉలవపాడు మండలానికి చెందిన సీఐటీయూ నాయకుడు చిలకపాటి మాలకొండయ్య మృతి పట్ల సీఐటీయూ నాయకులు శనివారం సంతాపం తెలిపారు. చాకిచర్లకు వెళ్లిన మాజీ రాష్ట్ర కార్యదర్శి సిద్దయ్య, జీవీబీ కుమార్ తదితరులు మృతదేహానికి నివాళులు అర్పించారు. కరేడు పీటీపీ ఫ్యాక్టరీ యూనియన్ నేతగా మాలకొండయ్య చేసిన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.