వరికుంటపాడు వద్ద వేంచేసి ఉన్న శ్రీ గోదాదేవి పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. అలాగే ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పలు నృత్య ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకున్నాయి. భక్తుల కొరకు ఆలయ కమిటీ సభ్యులు, దాతలు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. రేపు తొలి ఏకాదశి కావడంతో ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువైంది.