అక్రమ లేఔట్ ల పై వరికుంటపాడు మండలం తహసిల్దార్ పసుపులేటి హేమంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మాట్లాడుతూ వరికుంటపాడు మండలంలో వ్యాపారులు ఇష్టానుసారంగా అక్రమ లేఅవుట్లు వేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వ నిబంధన మేరకు తొలుత భూమిని కన్వర్షన్ చేయించుకుని అన్ని రకాల నిబంధనలు పాటించాలని తెలిపారు. మండలంలో ఉన్న లే అవుట్లను రికార్డుల ఆధారంగా పరిశీలిస్తామన్నారు.