వరికుంటపాడు: మలేరియాపై అవగాహన

53చూసినవారు
వరికుంటపాడు: మలేరియాపై అవగాహన
వరికుంటపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మలేరియా నివారణ మాసోత్సవాలు గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా మలేరియా ఉదయగిరి సబ్ యూనిట్ అధికారి షేక్. గాజుల నౌషద్ బాబు మాట్లాడుతూ కీటక జనిత వ్యాధుల పట్ల ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రత పాటించాలని తెలిపారు. మలేరియా రాకుండా జాగ్రత్త తీసుకోవాలని ఒకవేళ మలేరియా వస్తే వైద్యులను సంప్రదించి తగిన చికిత్స పొందాలని సూచించారు.

సంబంధిత పోస్ట్