వరికుంటపాడు మండల డిప్యూటీ ఎంపీడీవో నాగూర్ వలి, నార్త్ కృష్ణంరాజుపల్లి గ్రామ పంచాయతీలో శుక్రవారం పర్యటించారు. అక్కడ జరుగుచున్న పారిశుధ్య కార్యక్రమాలను తనిఖీ చేశారు. అనంతరం కొన్ని కుటుంబాల వారికి ఐవీఆర్ఎస్ కాల్స్, చెత్త సేకరణపై అవగాహన కల్పించారు. అనంతరం ఎస్డబ్ల్యూపీసీ షెడ్ ను సందర్శించి పరిశీలించారు. ఉదయాన్నే ఇంటి వద్దకు వచ్చే గ్రీన్ అంబాసిడర్లకు చెత్త అందజేయాలని తెలిపారు.