నెల్లూరు జిల్లా వరికుంటపాడు సమీపంలో జాతీయరహదారి పై బైకును ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ఘటనలో ఇద్దరు గాయపడిన విషయం తెలిసిందే. గాయపడిన వారు దుత్తలూరు మండలం కొత్తపేటకు చెందిన బర్రె చిన్న, తాళ్లూరి రవి లుగా గుర్తించారు. తీవ్రంగా గాయపడ్డ తాళ్లూరి కృపనందం అలియాస్ చిన్ని (22) ఉదయగిరి నుంచి నెల్లూరు తీసుకెళ్ళ్తుండగా బుచ్చిరెడ్డి పాలెం వెళ్లేసరికి మృతి చెందాడు.