నెల్లూరు జిల్లాలో ఇద్దరు ఉపాధి హామీ సిబ్బంది సస్పెండ్ అయ్యారు. నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలంలో మంగళవారం జరిగిన ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీ ప్రజావేదికలో అక్రమాలు వెలుగు చూశాయి. 11, 18, 776 రూపాయల అవినీతి జరిగిందని డ్వామా పీడీ గంగాభవాని గుర్తించి, రికవరికి ఆదేశం ఇచ్చారు. ఉపాధి హామీ సిబ్బంది తీరుపై పీడీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇద్దరు టీఏలు, ఒక ఈసీని సస్పెండ్ చేశారు.