వరికుంటపాడు: కొండరాజుపల్లిలో పోలేరమ్మకు పొంగళ్ళు

54చూసినవారు
వరికుంటపాడు: కొండరాజుపల్లిలో పోలేరమ్మకు పొంగళ్ళు
నెల్లూరు జిల్లా, వరికుంటపాడు మండలం కొండరాజు పల్లి గ్రామంలో శనివవారం సీతారాముల కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. ఆదివారం గ్రామ దేవత పోలేరమ్మకు మహిళలు పొంగళ్ళు పెట్టారు. ఇళ్ల నుంచి మేళతాళాలు మధ్య పొంగళ్ళు తలపై పెట్టుకుని అమ్మవారి ఆలయానికి చేరుకుని పొంగల్లు పొంగించి నైవేద్యాలు సమర్పించారు. భారీగా బాణసంచా కాల్చి సంబరాలు చేశారు. అమ్మవారికి కానుకలు సమర్పించి మొక్కలు చెల్లించుకున్నారు.

సంబంధిత పోస్ట్