నెల్లూర్ జిల్లా వరికుంటపాడు మండలం పెద్దిరెడ్డిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా ఎన్. రవి నియమితులయ్యారు. గతంలో పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేసి తిమ్మారెడ్డిపల్లి పాఠశాల నుండి పదోన్నతిపై పెద్దిరెడ్డిపల్లి పాఠశాలకు గురువారం బదిలీ అయ్యారు. పూర్వ విద్యార్థులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి సాదరంగా సత్కరించి స్వీట్స్ అందించి శుభాకాంక్షలు తెలిపారు.