రానున్న సంక్రాంతి పండుగ సందర్భంగా వరికుంటపాడు మండల ప్రజలకు వరికుంటపాడు సబ్ ఇన్ స్పెక్టర్ ఎం. రఘునాథ్ విజ్ఞప్తి చేశారు. సంక్రాంతి సంబరాలు మీ కుటుంబ సభ్యులతో కలిసి సంతోషకర వాతావరణంలో జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలందరూ ప్రశాంత వాతావరణంలో సంక్రాంతి వేడుకలు జరుపుకోవాలి, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఏమాత్రం సహించమని హెచ్చరించారు.