నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం కొండరాజు పల్లిలో శనివారం శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం జరిగింది. స్వామి అమ్మవారిని అర్చకులు ప్రత్యేకంగా పరిమళ పుష్పాలు, ఆభరణాలతో అలంకరించారు. కళ్యాణ వేదికపై కొలువు తీర్చారు. సీతారాముల కళ్యాణం మహోత్సవాన్ని వీక్షించడానికి గ్రామంలోని భక్తులు భారీగా తరలివచ్చి తిలకించారు. అనంతరం అత్యంత వైభవంగా మేళ తాళాలు మధ్య గ్రామోత్సవం నిర్వహించారు.