మండల కేంద్రమైన వరికుంటపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి బిరుదు రాజు, తారక తనుష్ రాజు గురువారం వెలువడిన త్రిబుల్ ఐటీ ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించి 2024-25 విద్యా సంవత్సరానికి వైయస్సార్ జిల్లా ఇడుపులపాయ ట్రిపుల్ ఐటి కళాశాలలో సీటు సాధించాడు. దీంతో శుక్రవారం పాఠశాల ప్రధానోపాధ్యాయులు వీరభద్రయ్య విద్యార్థిని అభినందించి ఆశీస్సులు అందించారు.